అమ్మ ఒడే వెచ్చన..!

శీతాకాలం..మంచు కురిసే వేళలు, జివ్వు మనిపించే చల్లని పిల్ల గాలులు. కంటికిఅందంగా కనిపించే ప్రకృతి సోయగాలు. అంతవరకు బాగానే ఉంది. ఈ కాలంరోగాలకు కూడా నిలయమే. కాస్త ఏమరుపాటుగా ఉన్నా, అనారోగ్యానికి గురికావాల్సిందే. ఉన్నఫళంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీంతో చలితీవ్రత పెరిగింది. ఫలితంగా శరీరంలోని ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి.ఈ వ్యత్యాసాల కారణంగా  ప్రధానంగా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ శీతాకాలంలో బాలలఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిఉంది. అందుకు సంబంధించి'సాక్షి' అందిస్తున్న ప్రత్యేక కథనం.